సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న బ్యూటీ అషు రెడ్డి.ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బుల్లితెర ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ గా అషురెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.
తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుంది.
అలా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.
ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.
బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.
అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇక ఈమె రెండు సార్లు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రెండో సారి చేసిన ఇంటర్వ్యూతో మాత్రం మరింత రెచ్చిపోయింది.వర్మ తో మాట్లాడిన తీరు, వర్మ తనతో ప్రవర్తించిన తీరు అందరిని షాక్ అయ్యేలా చేసింది.

అయితే ఇదంతా పక్కన పెడితే అషు రెడ్డి ఈ మధ్య బాగా బలితెగించిందని చెప్పవచ్చు.బాగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాలను బయటపెడుతూ బాగా ఎక్స్ పోసింగ్ చేస్తుంది.అయితే తాజాగా మరికొన్ని హాట్ ఫోటోలు వదిలింది.ఇక అందులో తన డ్రెస్ అవతారం చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.దీంతో ఆమెకు బాగా నెగటివ్ కామెంట్స్ తో పాటు విమర్శలు వస్తున్నాయి.ఇక ఓ నెటిజన్.
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా డ్రెస్సింగ్ ఉండేది నీది.కొంచెం ఫేమ్ రాగానే మరీ బరితెగించేస్తారు.
మీ అమ్మా నాన్నకి ఏమి ఎలా అనిపిస్తుందో అని ఆలోచించరా అంటూ విమర్శలు చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.







