పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు అయిన విషయం మనందరికీ తెలిసిందే.మొదటి భార్య నందిని కాగా రెండవ భార్య రేణు దేశాయ్.
ఇక మూడవ భార్య అన్నా లెజీనోవా. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెండవ భార్య రేణు దేశాయ్ విడాకులు ఇచ్చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై పదేపదే వైసీపీ నాయకులు ప్రస్తావిస్తూ నాలుగో భార్య ఎవరు అంటూ విమర్శలు చేయడంతో పాటు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు.ఏ విషయం మాట్లాడిన ఎటు వచ్చి మూడు పెళ్లిళ్ల దగ్గరికి టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంటుంది.
అయితే ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు సీరియస్ అయినప్పటికీ వైసీపీ వారు మాత్రం అలాగే విమర్శిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మూడో భార్య విడాకులకు సంబంధించి వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంకొకసారి విడాకులకు ప్రయత్నిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఇదే వార్తను వైరల్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.కళ్యాణ్ మూడవ విడాకుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.వినిపిస్తున్న వార్తలు అన్నీ కూడా దుష్ప్రచారాలు అని తేలింది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజీనోవాతో ప్రేమగానే ఉంటున్నారు.వారిమధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు కూడా లేవు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడం యువశక్తి అనే పేరుతో జనసేన పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్రలో నిర్వహించనుండడంతో ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు కావాలని వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.







