దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా గత ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ సినిమాకు గాను ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి.ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి న్యూయార్క్ సిటీ ఉత్తమ దర్శకుడిగా అవార్డును కూడా అందించారు.
ఇక ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలబడింది.ఇలా ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ చిత్రం మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుంది.

ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కింది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో భాగంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది.ఇక ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు.ఇక ఈ పాటను ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాయగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
ఇక ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఇక ఈ పాట ఎంతోమంది అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా నేడు గోల్డెన్ గ్లోబల్ అవార్డును అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నటువంటి ఎన్నో చిత్రాలు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాయి.ఇక ఈ పాట ఇలాంటి అవార్డును అందుకోవడంతో మెగా నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







