రోడ్డు మీద దీన స్థితిలో మీడియా కంట పడ్డ పాకీజ

90లలో యమ స్టైలిష్ గా బాత్రూంలు కడిగిన పాకీజా మీకు గుర్తుందా.? ప్రస్తుతం కడుదీయనమైన స్థితిలో ఆమె జీవితం రోడ్డుపాలైంది.షుగర్ వ్యాధి పట్టి పీడిస్తోంది.ఓవైపు గర్భాశయాన్ని తొలగించడంతో ఆమె ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మందగించాయి.ఆరోగ్యం సహకరించకపోవడంతో అవకాశాలు కూడా రావడం లేదు.తన పరిస్థితిని వివరిస్తూ తమిళనాడు సీఎం కి, అలాగే తన తోటి నటీనటులకు చాలామందికి వీడియోలు పెట్టినా కూడా ఎవరు స్పందించలేదు.

 Assembly Rowdy Movie Fame Actress Pakeezah Vasuki Personal Life Struggles,pakeez-TeluguStop.com

రోడ్డు మీద దీనంగా నడుస్తూ వెళుతున్న పాకీజను చూసిన ఒక మీడియా ఛానల్ ప్రతినిధి గుర్తుపట్టి పలకరించాడు.


మీరు పాకీజా కదా ఇక్కడ నడుస్తూ వెళ్తున్నారేంటి అని అతను అడగగా ఇప్పుడు నేను చెన్నైలో ఉండడం లేదు.నా సొంత గ్రామం వెళ్లిపోయాను.నా పరిస్థితి ఏమి బాగోలేదు నడిగర సంగం సహాయం చేయడం లేదు.

నేను ఒక స్నేహితురాలని కలవడానికి ఇక్కడికి వచ్చాను.నా సొంత ఇల్లు, ఆస్తులు అన్ని అమ్మేసుకున్నాను.

ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది.ఇక్కడ ఒక హాస్టల్లో అద్దెకు దిగాను.

నా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పాకీజా తన బాధని చెప్పుకున్నారు.

భోజనం చేశారా అని సదరు ప్రతినిధి అడగగా, లేదు టీ తాగి బయలుదేరాను అని చెప్పారు పాకీజా.దాంతో ఒక మంచి హోటల్లో ఫైవ్ స్టార్ ఫుడ్ పెట్టించి మాట్లాడించే పనిలోపడ్డారు ఆ ప్రతినిధి.ఇలాంటి భోజనం చేసి దాదాపు 6 నెలలు గడిచిపోయింది అంటూ పాకీజా చెప్పడం చూస్తే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నటి జయలలిత తనకు సహాయం చేస్తుందని ఎదురు చూస్తున్నట్టుగా చెప్పింది పాకీజా.ఎందుకంటే జయలలిత పాకీజా తొలినాల్లలో ఒకే గదిలో అద్దెకు ఉండేవారు.తనకు ఏదైనా వేషాలు ఇప్పిస్తుందేమో అడగడానికి వచ్చాను అంటూ పాకీజా తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఆమెకు సహాయం చేయమని అర్థించారు పాకీజా.

Actress Pakeezah Vasuki Personal Life Struggles

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube