మనకు ఉద్యమాలు అంటే తెలంగాణ ఉద్యమం లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్న మీటూ ఉద్యమం వంటివే గుర్తొస్తాయి.కానీ ఎంత మంది కి తాగొద్దు అని ప్రచారం చేసే ఉద్యమాల గురించి తెలుసు చెప్పండి.
ఎక్కడ చూసినా కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రకటనలు, స్టార్ సెలబ్రిటీలతో రకరకాల వాణిజ్య ప్రకటనలు, ఆ మందు, ఈ బ్రాండ్ అంటూ సెలబ్రిటీలు ముచ్చట్లు.తాగండి అన్నట్టుగా రోజుకు ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వస్తూ ఉంటే తాగే వారి సంఖ్య పెరుగుతుంది కానీ తాగద్దు అని చెప్పే వారు ఎవరు ఉన్నారు చెప్పండి.
కానీ ఇటీవల బి డబ్ల్యుడి అని ఒక ప్రకటన విస్తారంగా కనిపిస్తోంది.
DWD అంటే దావత్ వితౌట్ దారు. మందు లేకుండా విందు చేసుకోండి అని చెప్పడం.సాధారణ ప్రజల నుంచి, బీద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి చిన్న పార్టీ లో లేదా ఫంక్షన్ లో మందు లేకుండా విందు చేయడం జరగదు.
అంతెందుకు సినిమాల్లో కూడా హీరో స్టైల్ గా మందు తాగుతుంటే అభిమానులకు బాగా నచ్చుతుంది.కానీ ఆ మందు వల్లే ఎంతో మంది రోడ్డున పడుతున్న విషయం మర్చిపోతున్నారు.
అలాగే ప్రభుత్వాలు కూడా ఆల్కహాల్ పైన ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది కాబట్టి పూర్తిగా నిషేధించడం చేయదు.ఒక్క రోజు మందు పై వచ్చే టాక్స్ లేకపోతే ప్రభుత్వాలు నడవని స్టేజ్ కి వ్యవస్థ దిగజారి పోయింది.
గతంలో దమ్మున్న నాయకుడు సీనియర్ ఎన్టీఆర్ పూర్తి మద్యపాన నిషేదం అమలు చేశారు.కానీ ఇప్పుడు నడుస్తున్న ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ దిశగా ఒక అడుగు కూడా వేయడం లేదు.మందు తాగకపోతే మనుషుల మేదడ్ పని చేయక, ఏం చేస్తున్నారో తెలియని విధంగా దిగజారి పోతున్నారు.ఎక్కువ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటున్న తమ గురించి తాము ఆలోచించు కోవడం లేదు.
అందుకే Dwd లాంటి ఉద్యమాలు సోషల్ మీడియాకి పరిమితం కాకూడదు.ప్రతి ఒక్కరు తమ వంతుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.DWE ఉద్యమం నడిపిస్తున్న ఉద్యమకర్త పేరు చేగొండి చంద్రశేఖర్. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాస్వాములు కావాలి.