నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ లో మొసళ్లు కలకలం సృష్టిస్తున్నాయి.మస్కాపూర్ చెరువులో రెండు మొసళ్లను స్థానికులు గుర్తించారు.
ఈ క్రమంలో చెరువు కట్టపైకి మొసళ్లు వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.వర్షాల కాలంలో మొసలి పిల్లలు చెరువులోకి కొట్టుకు వచ్చాయి.
ఓ వైపు మొసళ్లను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.మరోవైపు మొసళ్ల సంచారంతో పశువులు, గొర్రెల కాపరుల్లో భయం నెలకొంది.
దీంతో మొసళ్లను పట్టుకుని తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.