తెలుగు ప్రేక్షకులకు చాలామందికి నటుడు దునియా విజయ్ ఎవరో తెలియదు.కన్నడలో ఎన్నో సినిమాలలో నటించిన దునియా విజయ్ మొదటిసారిగా వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.
వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు దునియా విజయ్.బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దునియా విజయ్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

వీరసింహారెడ్డి సినిమా గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాడు.ఈ సందర్భంగా దునియా విజయ్ మాట్లాడుతూ.నా తల్లిదండ్రులే నా దేవుళ్లు.
వారి ప్రార్థనల వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.వీరసింహారెడ్డి సినిమా షూటింగ్‌కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు.
ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఇప్పటికి నాకు ఉంది.ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది అని చెప్పుకొచ్చాడు విజయ్.అయితే దునియా సినిమా మధ్యలో ఆగిపోతే తాను రూ.12 లక్షలు ఇచ్చానని అప్పుడు ఇంట్లోవాళ్లతో గొడపడి మరీ ముందడుగు వేశానని ఇక చివరికి సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తన ఇంటి పేరుగా మారిపోయింది అని చెప్పుకొచ్చాడు దునియా విజయ్.

దునియా సినిమా తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను.కానీ తెలుగులోకి రావడానికి చాలాకాలం పట్టింది అని తెలిపాడు విజయ్.కాగా మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు కన్నడలో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను.తర్వాత గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమా గురించి సంప్రదించాడు.
ముసలిముడుగు ప్రతాప్‌రెడ్డి రోల్ చేయాలన్నారు.ఆ రోల్ గురించి చెప్పగానే ఓకే చెప్పేశాను ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా? అని ఎదురుచూశాను.అనుకున్న విధంగానే సినిమాలో నటించాను సినిమా అదిరిపోతుంది అని తెలిపాడు విజయ్.మరి వీర సింహారెడ్డి సినిమా దునియా విజయ్ కు ఏ మేరకు గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి మరి.







