మాజీ మంత్రి ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రాజకీయ జీవితం గందరగోళంలో పడింది.టిడిపిలో ఆయన కు మంచి ప్రాధాన్యమే ఉండేది.ఎంపీగాను ఆయన టిడిపి తరఫున ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేవారు.2019 ఎన్నికల సమయంలో టిడిపి నుంచి వైసీపీలోకి అవంతి జంప్ చేశారు.వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ను సాధించారు.ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మొదటి మంత్రివర్గ విస్తరణలోనే అవంతి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది .అయితే రెండో విడత మంత్రివర్గ విస్తరణ లో మాత్రం అవంతిని జగన్ తప్పించారు.అప్పటికే ఆయన చుట్టూ అనేక వివాదాలు చుట్టుకోవడం దానికి ఒక కారణం.
ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని అవంతి ఆశలు పెట్టుకున్న, జగన్ మాత్రం ఆయనను తప్పించారు.ఇక మంత్రిగా ఉన్న సమయంలో అవంతి టిడిపి అధినేత చంద్రబాబు పై విమర్శలతో విరుచుకుపడేవారు.
అయినా ఆయనను అవి ఏవి మంత్రి పదవి నుంచి కాపాడలేకపోయాయి.ఇక మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అవంతి చంద్రబాబుపై విమర్శలను సైతం తగ్గించేశారు.2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు.పోనీ టిడిపిలోకి వెళ్దామంటే ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత చంద్రబాబుపై అవంతి చేసిన విమర్శలు అడ్డం పడుతున్నాయి.

చంద్రబాబు అవంతికి మంచి ప్రాధాన్య ఇచ్చినా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేయడం, అనేక విమర్శలతో చంద్రబాబుపై విరుచుకు పడడం ఇవన్నీ టిడిపిలోకి అవంతి వెళ్లేందుకు ఇప్పుడు అవరోధంగా మారాయి.పోనీ జనసేన వైపు వెళ్దామంటే పవన్ కళ్యాణ్ గురించి అవంతి చేసిన విమర్శల నేపథ్యంలో పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఇప్పుడు టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉండడంతో ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో టికెట్ దక్కుతుందని , అలాగే తప్పకుండా గెలుపు దక్కుతుందని అవంతి అంచనా వేస్తున్నారు.కానీ ఈ రెండు పార్టీలలోకి వెళ్లేందుకు ఈ రెండు పార్టీల అధినేతలపై గతంలో చేసిన విమర్శలు అడ్డుగా మారాయి.
ఇక వైసిపి లోను ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది .

తనకంటే వెనుక చేరిన పంచకర్ల రమేష్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం పై అసంతృప్తితో అవంతి శ్రీనివాస్ ఉన్నారు.తనను పక్కనపెట్టి పంచకర్ల రమేష్ బాబును వైసీపీ అధిష్టానం ప్రోత్సహిస్తూ ఉండడంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .అయినా ఆయన కు టిడిపి, జనసేన లలో చేరే ఆప్షన్ లేకపోవడంతో సతమతం అవుతున్నారట.







