తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది చర్చ ఏమిటంటే… ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి పోటీ చేస్తారట.2014 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఒక ప్రచారమే జరిగింది.మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తారని వార్త వచ్చింది.అయితే ఈసారి మాత్రం ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా కచ్చితంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసే ఆలోచనలో ఉన్నారట.
కొందరు మాత్రం ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని ఆదిలోనే భయపెట్టేందుకు తెలంగాణ బిజెపి చేస్తున్న హడావిడి అని అంటున్నారు.ఏది ఏమైనా ఒక పక్క కెసిఆర్, మరొకపక్క కేటీఆర్ బిజెపి పార్టీపై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు.
కేంద్రంలో బిజెపి అధికారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో తమ అధిపత్యాన్ని చాటుకునేందుకు ఎన్నోసార్లు వీరు తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఇక బీఆర్ఎస్ పార్టీని స్థాపించి బిజెపికి వ్యతిరేకంగా ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.
ఈ సమయంలో బిజెపి అంత సామాన్యంగా వెనక్కి తగ్గే సమస్య లేదు.

అయితే వయసు రీత్యా మోదీ నేరుగా తెలంగాణ పార్లమెంటు నుండి పోటీ చేయకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని భోగట్టా.!ముందు నుండి చర్చలో ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది.ఇక మోదీ అంత సామాన్యంగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు.
అయితే వారి కంచుకోటలోనే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.గతంలో వారణాసిలో మోదీ తొలిసారి పోటీ చేసేటప్పుడు బిజెపి టీంలు రంగంలోకి దిగి విపరీతమైన గ్రౌండ్ వర్క్ చేశాయి.
ప్రస్తుతం పాలమూరులో ప్రస్తుతానికి అటువంటి కదలికలు కనిపించడం లేదు కానీ కెసిఆర్ ను చావుదెబ్బ కొట్టేందుకు మోదీ మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రచారాల్లో పాల్గొంటారు అన్న విషయం స్పష్టమైపోయింది.







