హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.భేటీ అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతో వైసీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు.అందువల్లే ప్రతిపక్షాలను కట్టడి చేయటానికి బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చారని చెప్పుకోచ్చారు.
ఇదే సమయంలో కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవటాని ఖండించారు.ప్రతిపక్షనేత హక్కులను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ అరాచకాలకీ ఇది ప్రారంభం మాత్రమే… రానున్న రోజుల్లో మరింతగా ముదురుతాయి అని పవన్ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా వైసీపీ వ్యవహరిస్తోంది అన్నట్టు ధ్వజమెత్తారు.
నేను అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది.నేను బయటికి రాకూడదు.
వాహనాలు కొనుక్కోకూడదు.ఫ్లెక్సీలు వాడొద్దంటారు…వాళ్లు మాత్రం ఫ్లెక్సీలు పెట్టుకుంటారు.
ఎన్నికలలో గెలవడానికి ఎన్ని రకాల అరాచకాలు చేయాలో వైసీపీ అన్ని చేస్తుంది.దీంతో ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడానికి ఏం చేయాలి.?, పెన్షన్ లా తొలగింపు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం అనే అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్లు.పవన్ స్పష్టం చేశారు.







