ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో... వంద మందిని ట్రిప్ కోసం ఎక్కడికి పంపించనున్నారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

 Vijay Devarakonda To Send 100 Fans To Manali Trip Devarasanta Details, Vijay Dev-TeluguStop.com

ఇక గత ఏడాది లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఇకపోతే గత ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ దేవర శాంటా పేరుతో ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేశారు.ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా అభిమానులకు కానుకలు ఇస్తుంటారు.

ఇక ఈ ఏడాది అభిమానులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్ ఇచ్చారు.వందమంది అభిమానులను ఈయన హాలిడే వెకేషన్ పంపించబోతున్నట్లు తెలియజేశారు.అయితే అభిమానులను హాలిడే వెకేషన్ కోసం ఎక్కడికి పంపించాలనే విషయంలో తనకు హెల్ప్ చేయమని కోరారు.ఈ హాలిడే వెకేషన్ కి సంబంధించిన ఖర్చులను కూడా తానే భరిస్తానని విజయ్ వెల్లడించారు.

తాజాగా ఈ ట్రిప్ గురించి మరోసారి అప్ డేట్ ఇచ్చారు.

ఇక ఈ ఏడాది తాను 100 మంది అభిమానులను మనాలి పంపించబోతున్నట్టు తెలిపారు.నేను మీలో 100 మందిని మనాలికి 5 రోజుల ట్రిప్ కు పంపుతున్నాను.మీరు మంచుతో కూడిన పర్వతాలను చూడబోతున్నారు.మీకోసం అన్ని ప్లాన్ చేశాను.18 సంవత్సరాలు పై బడి ఉన్నవారు ఫారం కంప్లీట్ చేసి నన్ను ఫాలో అవ్వండి.మీలో 100 మందిని ఎంపిక చేసాము.మీలో నేను బాగమవుతా అంటూ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక 100 మందిని మనాలి మౌంటెన్స్ పంపించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube