దేశంలో వాహనాల రిటైల్ విక్రయాలు 2021తో పోల్చిచూస్తే 2022లో ఎంతగానో పెరిగాయి.2021తో పోలిస్తే, 2022లో వాహన విక్రయాలు 15.28 నుంచి 2.11 కోట్ల యూనిట్లకు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.వీటిలో అత్యధికంగా ప్రయాణ వాహనాలు, ట్రాక్టర్లు అమ్ముడుపోయాయి.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) ఒక నివేదికను జారీ చేస్తూ, ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది.
దీనితో పాటు 2021తో పోలిస్తే 2022లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదికలో వెల్లడయ్యింది.ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం, 2022లో వాహనాల రిటైల్ విక్రయాలు 8,65,344 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 2021లో విక్రయించిన 6,55,696 వాహనాల కంటే 31.97 శాతం ఎక్కువగా ఉంది.అదే సమయంలో, డిసెంబర్ 2021తో పోలిస్తే 2022 డిసెంబర్‌లో వాహనాల అమ్మకం చాలావరకూ తగ్గింది.
ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం, ఇతర అన్ని రంగాలలో వాహనాల అమ్మకాలు పెరిగాయి, అయితే ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గాయి.
డిసెంబర్ 2022లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11 శాతం తగ్గాయి.
ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం, వార్షిక ప్రాతిపదికన 2020తో పోలిస్తే 2022 సంవత్సరంలో వాహనాల మొత్తం రిటైల్ అమ్మకాలు 17 శాతం పెరిగాయి.అదే సమయంలో ప్యాసింజర్ వాహనాల విక్రయం జోరుగా పెరిగింది.2022లో ప్రయాణ వాహనాల విక్రయాలు 34.32 లక్షలకు చేరుకున్నాయి.ఇది ఇప్పటివరకు అత్యధిక సంఖ్యగా నమోదయ్యింది.అదే సమయంలో డిసెంబర్ 2022 లో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 11 శాతం క్షీణత నమోదయ్యింది.

ఎఫ్ఏడీఏ తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నాయి.ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడానికి ద్రవ్యోల్బణం పెరగడం, వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడం కారణంగా నిలిచాయి అలాగే గ్రామీణ మార్కెట్లలో ద్విచక్ర వాహనాలపై మోజు తగ్గుముఖం పడుతున్నదని తేలింది.ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో పెరుగుదల చోటుచేసుకుంది.







