నందమూరి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనకు తెలిసిందే.ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమా పిల్లలు దాటి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా ద్వారా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తాజాగా ఈయన న్యూయార్క్ సినీ క్రిటిక్ నుంచి ఉత్తమ దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాకు పని చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.
ఇక తాజాగా అమెరికన్ వెరైటీ` మ్యాగజీన్ ప్రకటించిన టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉండడం విశేషం.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన నటీనటులలో తారక్ పదవ స్థానంలో ఉండడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.లిస్ట్ లో విల్ స్మిత్, హ్యూ జాక్మన్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ తో తారక్ పోటీ పడటం అంటే మామూలు విషయం కాదని అయితే ఇలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గురించి సినీ సెలబ్రిటీలు గాని ఇక్కడ మీడియా గాని ఏ మాత్రం పట్టించుకోలేదని నటి మంచు లక్ష్మి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇలాంటి ఘనత ఒక ఎన్టీఆర్ మాత్రమే సాధించారు.
అయితే ఎన్టీఆర్ సాధించిన ఈ ఘనత ఎవరికి ఎందుకు కనిపించలేదంటూ ఈమె ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రికార్డును ఎవరూ పట్టించకోవడం లేదని పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







