ఈ సంక్రాంతి విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏపీ లో జరగడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.రెండు సినిమా లు కూడా ఏపీ లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న నేపథ్యం లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తేనే అదనపు షో లకు అనుమతించేది.అలాగే టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతించేది అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ పరంగా ఏపీకి అన్యాయం జరుగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు షూటింగ్స్ ఏపీలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్దేశం తో కొత్త రూల్ ని తీసుకు వచ్చారు.
అందులో భాగంగానే ఈ రెండు సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అక్కడ జరిగాయి… ముందు ముందు మరిన్ని సినిమాల యొక్క ఈవెంట్స్ జరగబోతున్నాయి.
ఈ రెండు సినిమాల యొక్క అంచనాలు భారీగా ఉన్నాయి.
రెండు సినిమాల యొక్క టికెట్ల రేట్లు పెంచడం కోసమే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు మరియు ఈవెంట్స్ అక్కడ చేయడంతో పాటు భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అక్కడ చేశారు.చేయబోతున్నారు.
కనుక ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు అదనపు షో లకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గల వారు భావిస్తున్నారు.కానీ బాలకృష్ణ తాజాగా ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ వైకాపా ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తలిగినట్టుంది.

అందుకే పర్మిషన్ ఇస్తారా లేదా అనేదా అనుమానంగా మారింది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఇలా ప్రభుత్వాలు కండీషన్స్ పెడితే సినిమా మేకింగ్ కష్టం అవుతుందని నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు.







