ఏంటి? అవాక్కయ్యారా? మీరు విన్నది నిజమే.అది పిల్లంటే పిల్లి కాదు… పిల్లులందరికీ కింగ్ అన్నమాట.
అయితే ఒక పిల్లికి వున్న విలువ మనిషికి లేదంటారా? లేదు మరి! ఈ కలియుగంలో అంతా రివర్స్ గానే ఉంటాయి.టేలర్ స్వీఫ్ట్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న స్కాటిష్ ఫోల్డ్ ఒలివియా బెన్సన్ పిల్లి అక్షరాల 97 మిలియన్ డాలర్లు అంతే మీరు నమ్ముతారా? మన దేశ కరెన్సీలో చెప్పాలంటే రూ.800కోట్లు పైనే ఉంటుంది దాని ఖరీదు.ఆ డబ్బులు ఉంటే ఒక జిల్లా జిల్లాకు రోడ్లు వేసేయొచ్చని అనుకుంటున్నారా? నిజమే మరి!
ఆల్ అబౌట్ క్యాట్స్ అనే నివేదిక తాజాగా పేర్కొంటూ… ఇంత ఖరీదైన పిల్లి ప్రపంచంలో మూడవ సంపన్న పెంపుడు జంతువుగా రికార్డు సృష్టించిందని ఓ ఆర్టికల్ లో పేర్కోవడం విశేషం.అయితే ఆ పిల్లి కంటే కూడా రెండు జంతువులు ఉన్నాయా? అని అవాక్కవ్వొద్దు.నిజమే… న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం US ఆధారితంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయేన్సర్ @nalaక్యాట్ సియామీ మరియు టాబీ మిక్స్ విలువ 100మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.

అదేవిధంగా ఇటాలియన్ మీడియా కార్పొరేషన్ గున్థర్ కార్పొరేషన్ సంస్థ దగ్గర ఉన్న జర్మనీ షెపర్డ్ 500మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉందని కూడా చెబుతున్నారు మరి.అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతుంటుందో మీరే ఊహించుకోండి.ఇంతేగాక ప్రపంచంలో సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఓప్రా విన్‌ఫ్రే కుక్కలు సాడీ సన్నీ లారెన్ లైలా మరియు ల్యూక్ ఒక్కొక్కటి దాదాపుగా 30మిలియన్ల్ డాలర్ల విలువ కలిగిన సంపన్న పెంపుడు జంతువులగా కొనసాగుతున్నాయి.







