మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్న ఈ సినిమా లో చిరంజీవి లుక్ అద్భుతంగా ఉంది అంటూ మాస్ ఆడియన్స్ ఆసక్తి గా సినిమా ను చూడడం కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందంటూ ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు చిత్ర యూనిట్ సభ్యులు శుభ వార్త వినిపించారు.
రేపు సినిమా యొక్క ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఆ తర్వాత రోజు అంటే 8వ తారీఖున సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమా కు బాబీ దర్శకత్వం వహించాడు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వరకు చివరి దశ లో ఉంది, మరో వైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పూనకాలు తెప్పిస్తుంది.ఇక ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ధీమా తో ఉన్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, యూకే మరియు ఆస్ట్రేలియా లో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవి రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.







