ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.పిల్లల విద్య, వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని, ఇందుకోసం తాము సరైన చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు.
అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో ముఖ్యమైన నిర్ణయంగా మారుతుంది.ఈ విషయంలో చింతించకండి! పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భారతదేశంలో అనేక పథకాలు అమలులో ఉన్నాయి.
మార్కెట్‌లో అనేక కంపెనీల చైల్డ్ ప్లాన్‌లు అందిస్తున్నప్పటికీ, మీరు వాటన్నింటి గురించి ఎంతో తెలుసుకోవాలి.ప్రభుత్వం కూడా ఈ దిశగా అనేక పథకాలు అమలు చేస్తోంది.వాటన్నింటికి సంబంధించిన వివరాల గురించి పమగ్రంగా తెలుసుకుందాం.
1.సుకన్య సమృద్ధి యోజన
]
పిల్లల చదువు కోసం పొదుపు చేయడానికి సుకన్య సమృద్ధి యోజన ఉత్తమ మార్గం అని చెప్పుకోవచ్చు.భారతదేశంలో ఇది బాలికల విద్య మరియు వివాహాల కోసం ప్రారంభించారు.ఈ పథకంలో ఏడాదికి 7.6 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.సుకన్య సమృద్ధి యోజన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది.
2.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పిల్లల విద్య కోసం పొదుపు చేయడానికి ఉద్దేశించిన ఒక గొప్ప ఎంపికగా నిలుస్తుంది.ఇది భారత ప్రభుత్వం అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పీపీఎఫ్ కింద ఇందులో ప్రతి సంవత్సరం 7.1 శాతం స్థిర వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.ఇక్కడ మరో విషయం ఏమిటంటే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీస వ్యవధి 15 సంవత్సరాలు అని గుర్తుంచుకోండి.

3.సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
ఈ పథకం కింద, తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం పొదుపు చేయవచ్చు.ఇది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పొదుపు పథకం అని తెలుసుకోండి. ఎస్‌సీఎస్‌ఎస్ కింద ప్రతి సంవత్సరం 7.4 శాతం స్థిర వడ్డీ రేటు అనేది అందుబాటులో ఉంటుంది.దీని కనీస పెట్టుబడి కాలం ఐదు సంవత్సరాలు అని గుర్తుంచుకోండి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ప్రధానంగా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు, ఆ డబ్బును పిల్లల పెళ్లికి ఉపయోగించాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది.
పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీమీరు పోస్టాఫీసు పథకం కింద పొదుపు ఖాతాను నిరభ్యరంతంగా తెరవవచ్చు.దీనిలో సంవత్సరానికి 6.7 శాతం రాబడిని పొందవచ్చు.ఈ పథకంలో10 ఏళ్ల మెచ్యూరిటీతో రూ.5 లక్షల డిపాజిట్‌పై రూ.9,71,711 మొత్తం పొందవచ్చు.ఇంతే కాకుండా, 15 సంవత్సరాల పాటు దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.13,54,631 మొత్తం అందుకోవచ్చు.







