ఆ హీరోయిన్ తో వాట్సాప్ చాట్ మొత్తం బయటపెట్టిన సుమ.. సిగ్గుతో తలదించుకున్న హీరో?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది.

 Anchor Suma Leaks Santosh Sobhans Whatsapp Chat Video Goes Viral Details, Anchor-TeluguStop.com

అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ కనకాల వేరే వినిపిస్తూ ఉంటుంది.ఈవెంట్ లలో,ప్రీ రిలీజ్ వేడుకలలో, ఆడియో ఫంక్షన్ ఇలా ఏ ఈవెంట్ లో చూసిన సుమ కనకాల పేరు వినిపిస్తూ ఉంటుంది.

బుల్లితెరపై ముకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది సుమా కనకాల.ఇది ఇలా ఉంటే తాజాగా సుమ సుమ అడ్డా అనే ఒక లేటెస్ట్ ఎంటర్టైన్ ప్రోగ్రామ్ ని మొదలుపెట్టింది.

ఇదివరకు ప్రతి శనివారం సుమ హోస్టుగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే కాష్ ప్రోగ్రామ్ కీ బుల్లితెర సెలబ్రిటీతోపాటు వెండితెర సెలబ్రిటీలు స్టార్ డైరెక్టర్,ప్రొడ్యూసర్ లు సైతం హాజరయ్యారు.

ఇకపోతే తాజాగా సుమ క్యాష్ షో ప్లేసులో సుమ అడ్డా అనే ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.ఈ కార్యక్రమంకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ జనవరి 7న ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన అప్పుడు ప్రోమోని తాజాగా షో నిర్వాహకులు విడుదల చేశారు.మొదటి ఎపిసోడ్ కి సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న కళ్యాణం కమనీయం సినిమా టీం పాల్గొన్నారు.

ఇక మొదటి ఎపిసోడ్ కీ హీరో సంతోష్ శోభన్,ప్రియా భవాని శంకర్, డైరెక్టర్ పాల్గొన్నారు.అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో మొత్తం సందడి సందడిగా సాగింది.

ఎప్పటిలాగే సుమ తన ఎనర్జీతో అందరినీ కడుపుబ్బా నవ్వించింది.అయితే ఆ ప్రోమో లో హీరో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్ లీక్ హైలెట్ అని చెప్పవచ్చు.హీరో మొబైల్ ని స్క్రీన్ కీ కనెక్ట్ చేస్తూ హీరో మొబైల్లో ఏం కనిపిస్తుందో మొత్తం అంతా కూడా బిగ్ స్క్రీన్ లో కనిపించే విధంగా చేసింది సుమ.ఇక హీరో వాట్సాప్ చాట్ లీక్ చేయగా అందులో అనుపమ తో పాటుగా ఎంతోమంది అమ్మాయిలు ఉండడంతో ఏంటిది అని అనగా హీరో సిగ్గుతో తల దించుకున్నాడు.అప్పుడు అనుపమ చాటింగ్ ఓపెన్ చేయగా హాయ్ హలో తిన్నావా అంటూ మెసేజ్ లు అన్ని చదివి వినిపించింది.అనంతరం సన్నిలియోన్ కి పెట్టిన మెసేజ్లు అన్ని డిలీట్ చేసి ఉండడంతో ఆ ప్లేస్లో ఏమున్నాయో చెప్పు అంటూ ఫన్నీగా స్పందించింది సుమ.అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube