వికలాంగులు అనబడే వారికి చాలా శ్రద్ధతో కూడిన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఎన్ని రకాలుగా మొత్తుకున్నా కొన్ని ప్రదేశాల్లో వారు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవ్వడం జరుగుతోంది.తాజాగా UPలోని ఓ ఫుడ్‌స్టాల్‌కు వెళ్లిన వికలాంగుల హక్కుల కార్యకర్త అయినటువంటి సత్యేంద్ర సింగ్‌కు ఘోర చేదు అనుభవం ఎదురైంది.
అతడు వికలాంగుల హక్కులకు కార్యకర్త మాత్రమే కాదు, ఒక వైద్యుడు కూడా.అలాంటి ఆయనకే అక్కడ మర్యాద దక్కలేదు… ఇక సామాన్యుడి దుస్థితి ఏమిటి? అని ప్రశ్నస్తున్నాడు!
సదరు ఫుడ్ స్టాల్ వద్దకి ఆయన వెళ్లగా అక్కడ వారు అలా తిరిగి రమ్మని ఓ ర్యాంప్ ని చూపించారు.కాగా అది దివ్యాంగుల కోసం నిర్మించిన ర్యాంప్ అని వారు చెప్పగా వెళ్లి చూసిన అతగాడికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.అవును, ఆ ర్యాంప్ ఎక్కడానికి అస్సలు అనువుగా లేదు.
అంతేకాకుండా ర్యాంప్ చివరి భాగంలో బయటకు వెళ్లకుండా 2 చైన్స్ ని కట్టి ఉంచారు.దాంతో చాలా అసౌకర్యంగా అనిపించడంతో సింగ్ చాలా బాధని వ్యక్తం చేశారు.
తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడది తెగ వైరలవుతోంది.

ఈ నేపథ్యంలో బృందావన్‌లోని ఓ ఫుడ్ స్టాల్ వద్ద దివ్యాంగుల కోసం నిర్మించిన ర్యాంప్ దృశ్యాలను ఆయన వీడియోలో చూపిస్తూ వాటిని గురించి వివరించారు. ర్యాంప్‌ను ఆయన మౌంట్ ఎవరెస్ట్‌గా అభివర్ణిస్తూ, స్లోప్ పైకి ఎక్కేందుకు ఆయన తన కుక్కతో కలిసి యత్నించినా ప్రయత్నం ఫలించకపోగా స్లోప్ చివర బారికేడ్ అడ్డుగా ఉంచడం మనకి కనిపిస్తుంది.దాంతో ఆయన మాట్లాడుతూ….
ప్రజలు శారీరక వైకల్యంతో బాధపడినా మౌలిక వసతుల లేమితో సొసైటీ తమను మానసిక వైకల్యానికి గురిచేస్తోందని సింగ్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతనికి మద్దతు లభిస్తోంది.







