దేశంలో సోషల్ మీడియా ప్రభావం మామ్మూలుగా లేదు.చిన్నపిల్లలనుండి, పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియా అంటే ఏమిటో ఇపుడు తెలియనివారు ఉండరంటే మీరు నమ్మితీరాలి.
ఈ క్రమంలోనే కొంతమంది ఔత్సాహికులు వివిధ భాషలలో ట్రెండింగ్ అయిన పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టిక్ టాక్, రీల్స్, షార్ట్స్ వంటివి బాగా ఫేమస్ అయ్యాయి.
అయితే ట్రెండింగ్ పాటలకు యువత రీల్స్ చేయడం, సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం సర్వ సాధారణం.
అదే పాటలకు దాదాపు 60 సంవత్సరాలున్న ఒక అంకుల్ తన నడుమును వయ్యారంగా ఊపుతూ డాన్స్ చేస్తే ఎలాగుంటుంది? పిచ్చ క్రేజీగా ఉంటుంది కదూ.ఇక్కడ కూడా అదే జరిగింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో పత్లీ కమరియా మోరీ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, దాదాపు నలుగురు అమ్మాయిలతో కలిసి ఒక అబ్బాయి కిస్ చేస్తున్నట్లు సైగ చేయగా.
ఆ అంకుల్ తన జెర్క్స్‌ను చూపించడాన్ని ఇక్కడ వీడియోలో మనం గమనించవచ్చు.

60 పడిలో పడినా కింద పడబోనంటున్న ఆ పోకిరీ అంకుల్ ని చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఒక నెటిజన్ స్పందిస్తూ… ఆ అంకుల్‌లోని యువకుడు ఇంకా మిగిలే వున్నాడా? అని ప్రశ్నించగా మరొక నెటిజన్ ‘చింత చచ్చినా దాని పులుపు చావలేదంటే ఇదే’ అని కాస్త కొంటెగా కామెంట్ చేసాడు.fasila.
shameer అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 54 లక్షల మంది చూడటం కాస్త విడ్డురమే అని అనుకోవాలి.కాగా అలాగే 27 లక్షల 10 వేల లైకులను అందుకున్న ఈ వీడియోకు నెటిజన్ల మనసులను దోచేస్తోంది.







