సూర్య అంటే చాల మంది అభిమానిస్తారు.హీరోయిజం అనే చెత్త పదాలకు సూర్య చాల దూరం.
అందుకే జై భీం లాంటి సినిమాలు చేయగలిగాడు.ఇప్పుడు దేశం మొత్తం సూర్య కొత్త ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు.
చాల ప్రెస్టీజియస్ గా, యూవీ క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ వారు కలిసి వెయ్యి కోట్లతో సౌత్ ఇండియాలోనే అవతార్ ని మించి ఒక సినిమా తీయబోతున్నారు.ఈ సినిమా 10 భాషల్లో విడుదల కాబోతుంది.
ఇక ఈ చిత్రానికి కేవలం డిజిటల్, హిందీ తో పాటు శాటిలైట్ రైట్స్ కోసం పెన్ స్టూడియోస్ వారు వంద కోట్లు పెట్టడం తో ప్రస్తుతం ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఒక్క బాషా లోనే ఇంత పెద్ద మొత్తం వచ్చింది అంటే మిగతా అన్ని భాషల్లో ఎంత మేర వసూళ్లు ఉంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే మనం అర్ధం చేసుకోవచ్చు ఇదొక గ్రాఫిక్స్ వండర్ గా ఉండబోతుంది అని.ఇక ఈ చిత్రానికి హీరోయిన్ గా బాలీవుడ్ నటి దిశా పటాని ని ఎంచుకోగా, సంగీతం అందిస్తుంది దేవి శ్రీ ప్రసాద్.దర్శకత్వం వహిస్తుంది శివ కాగా, ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు గానే యుద్దాలు, జానపదాలు, హిస్టరీ వంటి వాటినే తన కథగా ఎంచుకున్నాడు.సూర్య సైతం యాక్షన్ చేసి చాల రోజులయ్యింది.
దిశా మినహా మిగతా అంత తమిళ్ వారే.
తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠి, ఉర్దూ, సింహళం, మాండరిన్ వైగారా ఉండచ్చు.ఇక మన దేశం దాటితే ఈ మధ్య బాగా ఫ్యాషన్ గా మారిన రష్యా, జపాన్ కూడా యాడ్ అవ్వచ్చు.అందుకే ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అనచ్చు.
ఎలాగూ మన ఇండియన్ సినిమాలకు అక్కడొక మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది కాబట్టి అలాగే ఈ చిత్రాన్ని కూడా అక్కడ తోసెయ్యక తప్పదు.ఇక ఈ మధ్య ఇండియన్ సినిమాలు అన్ని గ్రాఫిక్స్ తో నిండిపోతున్నాయి.
అందుకే వెయ్యేళ్ళ క్రితం నాటి కథను 3D లో ప్రెజెంట్ చేయబోతున్నారు.ఇక సూర్య మాత్రం 13 రోల్స్ ఎలా పోషించబోతున్నాడు అనే క్రేజ్ బాగా ఏర్పడింది.