సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ వారిలో కొందరు మాత్రమే అభిమానుల కోసం ఎంత కష్టమైనా సరే రిస్క్ స్టంట్ లను ఏదైనా కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఎంత కష్టమైనా సరే వాటికోసం శ్రమిస్తూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు అభిమానులను మెప్పించడం కోసం హీరోలు చేసే కొన్ని స్టంట్ లు వారి మీదకు కూడా వస్తూ ఉంటాయి.అలా ఒక హీరో కూడా సినిమాలో నటించేటప్పుడు ఒకానొక సమయంలో తాను చనిపోతానని అనుకున్నాడట.
ఆ హీరో ఎవరు? అసలేం ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్ రోషన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.నేను నా జీవితంలో ఎక్కువ కష్టపడ్డ సినిమా వార్. ఆ సినిమా కోసం శారీరకంగా ఎంతో కష్టపడ్డాను.ఆ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లినంత పని అయింది.
అంతేకాకుండా ఆ సినిమా సమయంలో నేను చనిపోతానని కూడా అనుకున్నాను.అంతలా ఆ సినిమా కోసం కష్టపడ్డాను.
మొదట ఆ సినిమా కోసం నేను సిద్ధంగా లేను.కానీ ఆ పాత్రకు తగ్గట్టుగా నా బాడీని మార్చుకోవడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది అని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.

ఆ సినిమా పూర్తి అయ్యే నాటికీ నేను బాగా అలసిపోయాను.ఆ తర్వాత కొన్ని నెలల వరకు ఎటువంటి శిక్షణ తీసుకోలేక పోయాను అని చెప్పుకొచ్చారు హృతిక్ రోషన్.అనంతరం తనకు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ గెతిన్ ను గుర్తు చేసుకున్నాడు.కాగా వార్ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.హృతిక్ రోషన్ తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అందుకు ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేసిన 8 ప్యాక్ ఫోటో చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఈ వయసులో కూడా 8 ప్యాక్ బాడీతో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు హృతిక్ రోషన్.







