బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి దీపిక పదుకొనే ఒకరు.ఈమె కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా మారిపోయారు.
ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుకే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఈమెకు టాలీవుడ్ హీరోలతో నటించడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇలా ఈ సినిమాతో పాటు ఈమె బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ సినిమాలో నటించారు.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాలో బేషరమ్ అనే సాంగ్ ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ వివాదం గురించి ఇప్పటివరకు దీపిక ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.
ఇక ప్రస్తుతం ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో ప్రభాస్ సరసన నటించిన దీపిక పదుకొనే మరొక ఇద్దరు టాలీవుడ్ హీరోలపై కూడా మనసు పారేసుకున్నారు.ప్రభాస్ తో కాకుండా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.మరి ఈమెకు ప్రభాస్ మాదిరిగానే తారక్, బన్నీ అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.







