చైనా వారిని వెనకపడేసిన భారతీయులు.. సింగపూర్ లో ?

ఈ మధ్యకాలంలో చాలామంది ఏ సీజన్ తేడా లేకుండా టూర్లకు వెళుతూ ఉంటారు.ఇక అతి ముఖ్యంగా వేరే దేశాలకు టూర్లకు వెళుతూ ఉంటారు.

 India Second Largest Contributor Of Tourists To Singapore Details, India ,second-TeluguStop.com

ఎందుకంటే అక్కడ చూడటానికి ఎన్నో అద్భుతాలు ఉంటాయి.ఆ అద్భుతాలను సందర్శించడానికి చాలామంది టూర్లకు వెళుతూ ఉంటారు.

అయితే చాలామంది సింగపూర్ ను సందర్శించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.దీన్ని చూడ్డానికి ఎన్నో దేశాల నుండి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు.

అయితే ఆ పర్యాటకంలో మొన్నటిదాకా చైనా రెండవ స్థానంలో ఉండేది.కానీ సంఖ్యాపరంగా ఇప్పుడు భారతీయ పర్యాటకులు రెండో స్థానానికి చేరుకున్నారు.

కరోనా లేక ముందు చైనీయులే సింగపూర్ ను అత్యధిక సంఖ్యలో సందర్శించేవారు.ఇక చైనీయుల కు కరోనా ఉన్న సమయంలో ఎక్కడికి ఎంట్రీ ఉండేది కాదు.అందుకే చైనీయుల పర్యటకుల సంఖ్య తగ్గింది.దీంతో చైనీయులను వెనక్కు నెట్టి భారతీయులు రెండవ స్థానాన్ని దక్కించుకుంది.2022 నవంబర్ నాటికి సింగపూర్ సందర్శించిన భారతీయ సంఖ్య దాదాపు 612,300 అని సింగపూర్ టూరిజం బోర్డ్ తెలిపింది.అదేవిధంగా ఆ సింగపూర్లో ఎక్కువ రోజులుగా ఉంటూ పర్యటిస్తున్న వాళ్ళు కూడా భారతీయులే కావడం గమనార్హం.అయితే భారతీయులు అక్కడ దాదాపు 8.61 రోజుల పాటు దేశంలో పర్యటించారు.

Telugu China, India, Indonesia, Singapore-Telugu NRI

అయితే ఇండోనేషియన్లు మాత్రం 4.66 రోజులు పర్యటించారు.అదేవిధంగా మలేషియన్లు 4.28 రోజులు గడిపారు.అంతే కాకుండా ఆస్ట్రేలియన్లు కూడా 4.05 రోజులు పాటు సింగపూర్లో గడిపారు.ఇందులో ఎక్కువగా భారతీయులే ఆ దేశంలో పర్యటించడం జరిగింది.ఇంకా గతేడాది నవంబర్ తో ముగిసిన సంవత్సరంలో 9,86,900 మంది విదేశీయులు కూడా సింగపూర్ ను సందర్శించారు.

అయితే వీరిలో ఇండోనేషియా టూరిస్టులు సంఖ్యాపరంగా మొదటి స్థానంలో ఉండగా భారతీయ టూరిస్టులు రెండవ స్థానంలో ఉన్నారు.కోవిడ్ సంక్షోభం తర్వాత 2022లో తొలిసారిగా సింగపూర్ పర్యాటకం భారీగా పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube