ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలతో పాటుగా విజయ్ వారసుడు కూడా రేసులో దిగుతున్నాడని తెలిసిందే.వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు మేకర్స్.
దిల్ రాజు అయితే సంక్రాంతి విన్నర్ మేమే పక్కా అనేస్తున్నారు.అయితే ఈ సినిమా లో సెంటిమెంట్ పాళ్లు కొద్దిగా ఎక్కువే అని తెలుస్తుంది.
శ్రీకాంత్ విజయ్ కి బ్రదర్ పాత్రలో నటిస్తున్నారు.
మరి పోటీగా వస్తున్న వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు మాస్ బొమ్మలుగా వస్తుంటే.
వారసుడు మాత్రం పక్కా క్లాస్ మూవీగా వస్తుంది.అయితే ఎమోషనల్ గా ఎంత కనెక్ట్ చేసినా సరే సంక్రాంతికి మాస్ సినిమాలదే పై చేయి అవుతుంది.
మరి ఈ సినిమాల్లో ఏ మూవీ విజయ పతాకం సాధిస్తుందో చూడాలి.విజయ్ వారసుడు సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా సినిమాలో తమిళ నటులు శ్యామ్, శరత్ కుమార్ లు కూడా ఉన్నారు. విజయ్ తో తెలుగు ఈవెంట్ చేస్తేనే కానీ ఇక్కడ సినిమాపై బజ్ వచ్చేలా లేదు.
కానీ విజయ్ మాత్రం అందుకు నో అంటున్నట్టు టాక్.