ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్‎షిప్

ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్‎షిప్ జరగనుంది.హైదరాబాద్ లో ఇప్పటికే స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.

 Formula E-world Championship On February 11-TeluguStop.com

ఈ మేరకు ట్యాంక్ బండ్ తీరంలో ఏర్పాటు చేసిన సర్క్యూట్ లోనే ఫార్ములా ఈ -రేస్ జరగనుంది.ఎన్విరాన్ మెంట్, ఎనర్జీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ నినాదంతో రేసులో ఎలక్ట్రిక్ కార్లు పాల్గొననున్నాయి.

కాగా ఈ రేసులో మహింద్రా అండ్ మహింద్రా, ఫోర్డ్, జాగ్వార్ తో పాటు నిస్సాన్ వంటి పదకొండు కంపెనీల కార్లు పాల్గొననున్నాయని సమాచారం.కాగా తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ జరగనుంది.

అయితే వరల్డ్ వైడ్ 14 దేశాల్లో 16 రౌండ్లుగా ఫార్ములా ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించనున్నారు.ఈనెల 14న మెక్సికో సిటీలో తొలి రౌండ్ ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది.

జనవరి 27, 28న దరియాహ్ సిటీలో రెండో, మూడో రౌండ్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించనుండగా… ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో నాలుగో రౌండ్ జరగనుంది.అదేవిధంగా జూలై 30న లండన్ లో చివరి రౌండ్ ఉండగా… ఈ రేస్ లో మొత్తం 11 టీమ్స్ , 22 మంది రేసింగ్ డ్రైవర్లు పాల్గొననున్నారు.

ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో మొబైల్ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు.సర్క్యూట్ సహా రేసింగ్ డ్రైవర్స్ సెఫ్టీ ప్రమాణాలను ఎఫ్ఐఏ ప్రతినిధులు పరిశీలించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube