ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ట్విస్ట్ బయటకు వచ్చింది.తాజాగా మద్యం కుంభకోణంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ గొరకవి పేరు తెరపైకి వచ్చింది.
దుబాక్ కంపెనీతో పాటు ‘ఫై’ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు నిధులు మళ్లింపుపై ఈడీ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు పొందుపరిచినట్లు సమాచారం.
కాగా ‘ఫై’ కంపెనీకి ప్రవీణం గొరకవి ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.హవాలా రూపంలో నిధులను ‘ఫై’ కంపెనీకి మళ్లించారని ఈడీ అభియోగిస్తుంది.గతంలో ప్రవీణ్ నివాసంపై దాడులు నిర్వహించిన ఈడీ రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ గొరకవి సన్నిహితుడని తెలుస్తోంది.







