పవన్ కళ్యాణ్ యొక్క అన్ స్టాపబుల్ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ప్రభాస్ యొక్క హంగామా పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ యొక్క హంగామా అన్ స్టాపబుల్ లో మొదలు కాబోతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
కానీ అసలు విషయం ఏంటీ అంటే సీజన్ చివరి ఎపిసోడ్ గా మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారట.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా వినోదాత్మకంగా ఎపిసోడ్ ను రూపొందించారు అంటూ వార్తలు వస్తున్నాయి.
సంక్రాంతికి ఈ సీజన్ యొక్క పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తారని ఆహా వారి నుండి వార్తలు వస్తున్నాయి.కానీ ఆహా వారు మాత్రం ఇప్పట్లో ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయడం లేదు అంటూ స్పష్టతను ఇచ్చారు.
అతి త్వరలోనే ఎపిసోడ్ యొక్క ప్రోమో ను విడుదల చేయబోతున్నారు.ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతుంది అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ యొక్క హరి హర వీరమల్లు సినిమా యొక్క చిత్రీకరణ తుది దశలో ఉంది.మరో వైపు పవన్ కళ్యాణ్ రెండు మూడు కొత్త సినిమా లను కమిట్ అయ్యి ఆ సినిమా ల యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు.పవన్ కళ్యాణ్ కి ముందు ఇంకా మూడు నాలుగు ఎపిసోడ్స్ అన్ స్టాపబుల్ వస్తాయని.ఆహా వారు చాలా ప్రత్యేకంగా అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.
ప్రభాస్ యొక్క ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన కారణంగా అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్ గురించి మరింత హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.బాలయ్య సినిమా వీర సింహారెడ్డి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఈ షో లో ఉండబోతుంది అంటున్నారు.







