మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
గంగిరెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పిటిషన్ లో పేర్కొంది.ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్ పై విచారణను ఈనెల 5 కు వాయిదా వేసింది.
జస్టిస్ ఎంఆర్ఎఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎల్లుండి విచారణ జరపనుంది.కాగా కోర్టు సమయం ముగియడంతో తేదీ ఇవ్వాలన్న న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
ఇప్పటికై వైఎస్ వివేకా హత్య కేసును సుప్రీం ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.







