బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ మనందరికీ సుపరిచితమే.బాలీవుడ్ లో హీరోగా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
కదా మొదట ప్యార్ కా పంచ్ నామా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా ఇటీవలే భూల్ భులాయ్యా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కార్తీక్ ఆర్యన్.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ప్యారిస్ లో సందడి చేశారు కార్తీక్ ఆర్యన్. ఈ నేపథ్యంలోనే 2023 న్యూ ఇయర్ వేడుకలను మాజీ ప్రియురాలు అయినా సారా అలీ ఖాన్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
2023 కు స్వాగతం పలుకుతూ ఒకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేశారు ఈ జంట.ఇకపోతే గతంలో కార్తీక్ ఆర్యన్,సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.కార్తీక్ ఆర్యన్,సారా అలీ ఖాన్ బ్రేకప్ కి సంబంధించి ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.
కానీ ఇప్పటివరకు ఈ జంట బ్రేకప్ విషయం గురించి స్పందించలేదు.ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఒకసారి తన చాట్ షోలో వీరి రిలేషన్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కాగా సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లవ్ ఆజ్ కల్ సినిమాలో నటిస్తున్న సమయంలో ఏడాది పాటు డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్, అలాగే సారా అలీ ఖాన్ ఎవరికి వారు చేతినిండా వరస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.సారా అలీ ఖాన్ విషయానికి వస్తే.
ప్రస్తుతం సారా మెట్రో ఇన్ డినో అనౌన్స్, గ్యాస్ లైట్, నఖ్రేవాలి సినిమాలో నటిస్తోంది.అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది సారా అలీ ఖాన్.
ఇకపోతే కార్తీక్ ఆర్యన్ సినిమాల విషయానికి వస్తే.షెహజాదా, సత్య ప్రేమ్ కీ కథ, ఆషికి 3, కెప్టెన్ ఇండియా లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.







