హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై యాజమాన్యం స్పందించింది.టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది.
ఈ నేపథ్యంలో సిబ్బందితో చర్చించి సమస్యలు తెలుసుకుంటామని మెట్రో యాజమాన్యం వెల్లడించింది.సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని పేర్కొంది.
అదేవిధంగా ధర్నా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
అయితే, ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.ఐదేళ్లుగా రూ.11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు.ఈ క్రమంలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు.







