నాగ శౌర్య ఇలాంటి సినిమాలు ఎందుకు బాసు..!

యువ హీరో నాగ శౌర్య కెరీర్ లో సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోవట్లేదు.లాస్ట్ ఇయర్ వచ్చిన కృష్ణా వ్రిందా విహారి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

 Naga Shaurya Phalana Abbai Phalana Ammayi Movie , Naga Shaurya, Phalana Abbai Ph-TeluguStop.com

అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా నాగ శౌర్య ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య.

ఈ సినిమాని అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.అయితే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పోస్టర్ చూస్తే ఇదో సాఫ్ట్ స్టోరీ ఎమోషనల్ కథ అనిపిస్తుంది.కానీ నాగ శౌర్యని ఆడియన్స్ డిఫరెంట్ గా చూడాలని అనుకుంటుంటే ఆయన మాత్రం ఇలాంటి రొటీన్ కథలతో వస్తున్నాడు.

మరి ఈ సినిమా అయినా నాగ శౌర్య చేస్తున్న ప్రయత్నాన్ని సక్సెస్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.ఈ సినిమాతో పాటుగా నాగ శౌర్య నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నాగ శౌర్య ఆఫ్టర్ మ్యారేజ్ సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube