చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్..!!

ఆదివారం నూతన సంవత్సరం రోజు గుంటూరు వికాస్ నగర్ లో చంద్రబాబు తలపెట్టిన మహాసభలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే.చంద్రబాబు సభలో ఉన్నంతవరకు సజావుగా సాగిన గాని ఆ తర్వాత పంపిణీ కార్యక్రమం విషయంలో సభ నిర్వాహకులు.

 Minister Jogi Ramesh Made Serious Comments On Chandrababu Minister Jogi Ramesh,-TeluguStop.com

ప్రజలను అదుపు చేయలేక విఫలమయ్యారు.దీంతో ఒక్కసారిగా తోపులాట జరగటంతో తోక్కిసలాటలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు.రాష్ట్రంలో చంద్రబాబు సభలకు అనుమతులు ఇవ్వకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సభలలో ఇటీవల మరణించిన వారందరినీ చంద్రబాబే హత్య చేసినట్లుగా వర్ణించారు.నాలుగు రోజుల క్రితమే 8 మందిని బల్లి తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నారని విమర్శించారు.

నూతన సంవత్సరం రోజు విషాదాన్ని మిగిల్చారని మండిపడ్డారు.ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్టు చేసి ఆయన సభలకు అనుమతులు ఇవ్వకూడదని డిజిపినీ కోరుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో చంద్రబాబుని తిరగనిస్తే మరింత మంది బలవుతారు అని జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube