చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్..!!

ఆదివారం నూతన సంవత్సరం రోజు గుంటూరు వికాస్ నగర్ లో చంద్రబాబు తలపెట్టిన మహాసభలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే.

చంద్రబాబు సభలో ఉన్నంతవరకు సజావుగా సాగిన గాని ఆ తర్వాత పంపిణీ కార్యక్రమం విషయంలో సభ నిర్వాహకులు.

ప్రజలను అదుపు చేయలేక విఫలమయ్యారు.దీంతో ఒక్కసారిగా తోపులాట జరగటంతో తోక్కిసలాటలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు.రాష్ట్రంలో చంద్రబాబు సభలకు అనుమతులు ఇవ్వకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సభలలో ఇటీవల మరణించిన వారందరినీ చంద్రబాబే హత్య చేసినట్లుగా వర్ణించారు.నాలుగు రోజుల క్రితమే 8 మందిని బల్లి తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నారని విమర్శించారు.

నూతన సంవత్సరం రోజు విషాదాన్ని మిగిల్చారని మండిపడ్డారు.ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్టు చేసి ఆయన సభలకు అనుమతులు ఇవ్వకూడదని డిజిపినీ కోరుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో చంద్రబాబుని తిరగనిస్తే మరింత మంది బలవుతారు అని జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.