నాని ప్రస్తుతం చేస్తున్న దసరా సినిమా ముగింపు దశకు చేరుకుంది.దసరా పూర్తి అయిన వెంటనే శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమాను వైరా ప్రొడక్షన్స్ లో నాని ఒక సినిమాను చేయబోతున్నట్లుగా కొత్త సంవత్సరం సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది.
నాని లుక్ విషయంలో స్పష్టత వచ్చింది.దసరా సినిమా తర్వాత తన లుక్ ను పూర్తిగా మార్చబోతున్నట్లుగా నాని తెలియజేశాడు.
ఇక ఈ సినిమా లో నానికి జోడీగా సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.
సీతారామం సినిమా తర్వాత తెలుగు లో ఈ అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది.
ఎన్నో సినిమా ల్లో ఆఫర్లు వచ్చాయట.కానీ ఈమె మాత్రం చాలా ఆలోచించి కథ విషయంలో సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే నాని 30వ సినిమాకు ఓకే చెప్పింది అంటూ సమాచారం అందుతోంది.
తెలుగు లో మృణాల్ కి ఇది రెండవ సినిమానే.అయినా కూడా ఏకంగా కోటి రూపాయల పారితోషికం ను నిర్మాతలు ఆమెకు ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
మృణాల్ ఉండటం వల్ల సినిమా రేంజ్ కచ్చితంగా పెరుగుతుంది.

తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా మృణాల్ కి క్రేజ్ ఉంది.కనుక నాని సినిమా లో ఆమె మంచి ఛాయిస్ అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని మరియు మృణాల్ ల యొక్క జంట కచ్చితంగా బాగుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా లో నాని పాత్ర గతంలో ఏ సినిమా లో కూడా చూడని విధంగా ఉంటుందని అంటున్నారు.ఇక సీతారామం సినిమాలో ఎలా అయితే మృణాల్ కనిపించిందో అలాగే పద్దతైన సీతామాహాలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
నాని దసరా సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతుంది.ఇదే ఏడాదిలో నాని 30 సినిమా విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.నాని 30 సినిమా తర్వాత మృణాల్ మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.







