Volkswagen కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ప్రేమికులకు ఓ శుభవార్త.ఈ నూతన సంవత్సరాన ప్రముఖ జర్మనీ ఆటోమోబైల్ దిగ్గజం Volkswagen ఓ సూపర్ అప్డేట్ ఇచ్చింది.
తన కొత్త SUV మోడల్ ఎలక్ట్రిక్ కార్ ను USలో జనవరి మూడో తేదీన జరిగే CES (కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోస్)లో ప్రదర్శించననున్నట్లు తాజాగా వెల్లడించింది.కాగా నేడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.
ఎందుకంటే, మరీ ముఖ్యంగా కరోనా తరువాత పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.దిగ్గజ కంపెనీలకు ఈ న్యూ ఇయర్లో కొత్త మోడళ్లు కోసం జనాలు క్యూ కట్టే పరిస్థితి వుంది.
దానిని దృషిలో పెట్టుకొని.ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రకటించాయి.
ఒక్కో బ్రాండ్ ఒక్కో రకమైన ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులకు ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే జర్మనీకి చెందిన ఆటోమోబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ కూడా ఓ అప్ డేట్ ఇచ్చింది.
తన కొత్త ఎస్ యూవీ మోడల్ ఎలక్ట్రిక్ కార్ ను యూఎస్ లో జనవరి మూడో తేదీన జరిగే కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) లో ప్రదర్శించననున్నట్లు వెల్లడించింది.

ఇకపోతే, ఈ కారుకు సంబంధించిన ఫీచర్లను మాత్రం ఆ కంపెనీ ఇంకా ప్రకటించకపోవడం కొసమెరుపు.అయితే మార్కెట్ వర్గాలు పలు విధాలుగా కారు మోడల్, ఫీచర్లపై ఊహగానాలు చేస్తున్నాయి.ఇకపోతే వోక్స్ వ్యాగన్ ఇది వరకే తన ఎలక్ట్రిక్ వేరియంట్ సెడాన్ ను ID.Aero పేరుతోనూ, లార్జ్ ఎస్ యూవీ మోడల్ ను ID.8 పేరుతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.కాగా వోక్స్ వ్యాగన్ ID.8 కారును 2021లోనే ప్రకటించినా.ఇప్పటి వరకూ దానికి సంబంధించిన వివరాలు ఏవీ వెల్లడించలేదు కావున తాజా అప్డేట్ విషయం కూడా జరగాలి అంటే ఇంకెన్నాళ్లు పడుతుందో అనే విమర్శలు వున్నాయి.







