జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి ఆరు నెలలు ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.కొత్త సంవత్సరంలో జనవరి 17వ తేదీ నుంచి శని దేవుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఫిబ్రవరి 13న గ్రహాల రాజు సూర్యుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.రాశుల రాజు అయిన సూర్యుడు శని కలయిక వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి పంచమ స్థానానికి సూర్యుడు దశమికి శని అధిపతి.సూర్యుడు శని ఇద్దరి కలయిక వల్ల ఈ రాశి వారికి శుభప్రదం అవుతుంది.
ఈ వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది.
ఈ కాలంలో ప్రారంభించిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి.
కన్యా రాశి వారి గురించి మాట్లాడినట్లయితే సూర్యుడు ఈ రాశి వారి పన్నెండవ ఇంటి అధిపతి మరియు శని ఐదు మరియు 6 వ ఇంటికి అధిపతి గా ఉంటాడు.సూర్యుడు మరియు శని ఈ కలయిక వల్ల విదేశాలలో పని చేసే కన్యరాశికి ఎంతో శుభంగా ఉంటుంది.అంతే కాకుండా మంచి ఉపాధి, కొత్త ఉద్యోగా అవకాశాలను పొందే అవకాశం ఉంది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.ధనస్సు రాశిలో తొమ్మిదవ ఇంటికి సూర్యుడు మరియు రెండవ మరియు మూడవ ఇంటికి అధిపతి శని.ఈ రాశి వారి మూడో ఇంట్లో సూర్యుడు మరియు శని కలయిక ఏర్పడే అవకాశం ఉంది.రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారి ధైర్యం మరియు పరాక్రమం పెరిగే అవకాశం ఉంది.
ఈ రాశి చక్రంలో వ్యక్తులు తమ ఆకట్టుకునే ప్రసంగంతో ప్రజలను సులభంగా ఆకట్టుకుంటారు
.