2023 కొత్త సంవత్సరానికి ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా స్వాగతం పలికింది.కానీ బ్రిటన్ దేశ ప్రధాని కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలు కొత్త సంవత్సరంలోనైనా తీరిపోవాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎందుకంటే బ్రిటన్లు పరిస్థితి అలాగే ఉంది మరి.స్థానిక ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో పాటు రాజకీయ సంక్షోభాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల 2022లో బ్రిటన్ పలు ఇబ్బందులను ఎదుర్కొంది.2023లో తమ కష్టాలు తీరిపోయే అవకాశం లేదని ప్రధాని అన్నారు.దేశ ప్రధానిగా తొలిసారి పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటన్ సమస్యల నుంచి గట్టింగించడానికి తీవ్రంగా కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రజలు ముందు ఉన్న సమస్యలు కొత్త సంవత్సరంలో దూరమైపోతాయని నేను తప్పుదోవ పట్టించట్లేదని రిషి సునాక్ స్పష్టంగా తెలియజేశారు.
దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని వెల్లడించారు.ఉక్రెయిన్ రష్యా యుద్ధం బ్రిటన్ ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి నుంచి దేశం కోలుకోగానే ఉక్రెయిన్ పై రష్యా అక్రమ దాడి దండయాత్ర చేపట్టిందని తెలిపారు.ఇది అంతర్జాతీయంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
దీనికి బ్రిటన్ మినహాయింపు కాదు అందువల్లే రుణాలు, అప్పుల నియంత్రణ విషయాలు తీసుకున్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.

ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అంతేకాకుండా జాతీయ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అక్రమ వలసల సమస్య పరిష్కరిస్తున్నాము అని అని దేశ ప్రధాని వెల్లడించారు.భారత్ సంతతికి చెందిన రిషి సునాక్ 2022 అక్టోబర్లో బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బ్రిటన్ ప్రధానిగా పాలన చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ అరుదైన రికార్డు సృష్టించారు.







