రీ ఎంట్రీలోనూ ఏ మాత్రం తగ్గడం లేదుగా.... కాజల్ రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ అన్ని భాషలలోనూ వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈమె గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

 There Is No Reduction In Re Entry If Kajals Remuneration Is Known Dimma Should-TeluguStop.com

తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్ ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించారు.ఇలా ఈమె ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు అనంతరం వరుస అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

ఇలా రీ ఎంట్రీ తరువాత కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.ఇకపోతే కాజల్ అగర్వాల్ ఇది వరకు ఒక్కో సినిమాకు సుమారు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేది.

అయితే ఈమె ఇండస్ట్రీ నుంచి కాస్త విరామం తీసుకుని ఎంట్రీ ఇచ్చినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.

ఇలా రీఎంట్రీలో కూడా ఈమె ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం విశేషం.ఇలా రీఎంట్రీ సమయంలో కూడా కాజల్ ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ ఈమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలలో కూడా నటించి సందడి చేసిన కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత గ్లామర్ షో పాత్రలకు కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న భారతీయుడు సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube