వేరుశనగలను ఆహారంలో తీసుకోకపోవడం వల్ల ఈ ప్రయోజనాలు దూరమైనట్లే..

కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది.ఇంకా చెప్పాలంటే ఆహారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 These Benefits Are Lost By Not Consuming Peanuts In The Diet , Peanuts , Peanut-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే తరచూ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి కాకుండా పోషక ఆహారాలను చాలా మంది ప్రజలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు.అయితే పోషక విలువలు ఎక్కువగా ఉండే వేరుశనగలను మాత్రం చాలా మంది ప్రజలు ఆహారంగా తీసుకోకుండా ఉన్నారు.

వేరుశనగలు కొవ్వు శాతం అధికంగా ఉండడం వల్ల చాలా మంది వేరుశనగను తినడానికి అస్సలు ఇష్టపడరు.ఎందుకంటే ఇది తినడం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని చాలామందిలో అపోహ ఉంది.

చాలా మంది వేరుశనగలను తినడం వల్ల ఏవైనా అలర్జీ వస్తుందని దాన్ని దూరం పెడుతూ వస్తున్నారు.అందువల్ల వేరుశనగ వల్ల లభించే పోషకాలని దూరం అవుతున్నాయి.

ఇలా వేరుశనగను దూరం పెట్టేవారు ఈ పోషకాలు దూరమవుతాయని తెలిస్తే ఖచ్చితంగా వేరుశనగని వదిలిపెట్టకుండా తింటారు.

వేరుశనగలు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.అందుకే క్రమం తప్పకుండా వేరుశనగలను తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.వేరుశనగలలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల వీటిని కొద్ది పరిమాణంలో తీసుకున్న కడుపు నిండిన అనుభూతి ఎప్పుడూ ఉంటుంది.

దానివల్ల మనకు ఎక్కువ సేపు ఆకలి అనిపించదు.ఇందులో ఉన్నటు వంటి పీచు పదార్థాలు శరీరంలో జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు కూడా వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రతి రోజు కాస్త వేరుశనగలు తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube