తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు మన మెగాస్టార్.ఇకపోతే ఇటీవల ఆచార్య గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఆ తరువాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించింది.
దీంతో మెగా అభిమానులు తదుపరి సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి కి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.చాలామంది హీరోలు దర్శకనిర్మాతలు, హీరోయిన్లు అనేక సందర్భాలలో మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు.
తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చిరంజీవి పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఇండస్ట్రీలో అవసరాల కోసం వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు.
అటువంటి వారి గురించి మాట్లాడకపోవడమే మంచిది.ఇక చాలామంది సోషల్ మీడియా వేదికగా చిరంజీవి బాలకృష్ణ గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయిందని, పక్కన మరొక హీరో ఉంటేనే ఆయన సినిమాలు నడుస్తున్నాయి అంటూ కొందరు కారు కూతలు కూస్తున్నారు.
నాకు తెలిసి 1 నుంచి 10 వరకు చిరంజీవి గారే, పాత రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ మోహన్ బాబు కూడా లీన్ టైం చూశారు.మళ్లీ వాళ్ళ దారిలోకి వాళ్ళు వచ్చారు.
అందరికీ ఒక పీరియడ్ వస్తుంది.ఇక్కడ ఎవరి స్థానం వాళ్ళకి ఉంటుంది.
ఎవరి స్థానం వారిది.చిరంజీవి గారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సిన అవసరం లేదు.
ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ రెవెన్యూ ఎక్కడికి పోలేదు.కొన్ని సందర్భాలలో ఆయన విషయంలో నాగబాబు మాట్లాడకపోతేనే మంచిది అని అభిప్రాయం వ్యక్తం చేశారు తమ్మారెడ్డి భారద్వాజ.