నూతన సంవత్సర సందడి మొదలైపోయింది.ప్రతీ కొత్త సంవత్సరంనాడు సెంటిమెంట్ గా చాలా మంది తమ స్థాయికి తగ్గట్టు బంధువులకు, స్నేహితులకు రకరకాల Gifts ఇస్తూ వుంటారు.
ఇక గిఫ్ట్ ఎంపిక విషయంలో కూడా చాలా శ్రద్ద వహిస్తారు.మరీ ముఖ్యంగా వారి అభిరుచికి తగట్టు బహుమతులను ఇవ్వడం పరిపాటి.
కాగా అలాంటివారికోసం ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల గిఫ్ట్ ఆప్షన్లు ఉన్నాయి.ఇకపోతే ఈ కొత్త సంవత్సరాన గిఫ్ట్స్‌గా గ్యాడ్జెట్స్ ఇద్దామని అనుకునేవారు ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!.
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌టీవీలు మంచివి చాలా అందుబాటులో వున్నాయి.ఇంట్లో ఉంటూ రకరకాల కంటెంట్‌ను చూసి ఆనందించే వారికి ఇది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది.కాబట్టి ప్రస్తుతం OLED టీవీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి కనుక LG C2 TV ఇచ్చి చూడండి.మిమ్మల్ని ఇక మర్చిపోరు.అయితే దీని ధర మాత్రం కాస్త ఎక్కువే.హై -పిక్చర్ క్వాలిటీతో పాటు VRRకు సపోర్ట్ చేస్తుంది.ఇక లిస్టులో రెండవ గిఫ్ట్ Nescafee- స్మార్ట్ కాఫీ మేకర్ గురించి వినే వుంటారు.ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మందికి కాఫీ సొంతంగా ప్రిపేర్ చేసుకునే సమయం దొరకదు.
ఇలాంటి వారికి నెస్కేఫ్ స్మార్ట్ కాఫీ మేకర్ వంటి గాడ్జెట్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక ఎవరన్నా మీ స్నేహితులతో ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టే వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే “గార్మిన్ ఫార్ రన్నర్ 255” బెస్ట్ ఛాయిస్.ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో సౌకర్యవంతమైన, తేలికపాటి డిజైన్ చూడటానికి ఇది స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంది.ఇక మీ స్నేహితులతో హెడ్సెట్ ఇష్టపడేవారు ఉంటే Sony Inzone H9 ఇచ్చి చూడండి.
మంచి థ్రిల్ అయిపోతారు.ఇది అత్యుత్తమ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీతో లభిస్తోంది.
ఇందులో సౌకర్యవంతమైన ఇయర్ కుషన్స్, హై-క్వాలిటీ ప్లాస్టిక్స్ ఉంటాయి.గేమర్ కోసం మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.