2022 ఏడాదిలో ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఎవరు అనగానే మృణాల్ ఠాకూర్ నే అందరికి గుర్తుకు వస్తుంది.సీతారామం సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఆకట్టుకుంది.
సీత పాత్రలో నటించిన ఈమె సీతగా ఆడియెన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది.ట్రెడిషనల్ లుక్ తో అందరిని కట్టి పడేసింది.
ఇక మొదటి సినిమాతోనే నటన, అందంతో ఆకట్టుకున్న ఈమెకు వరుస ఆఫర్స్ వరించాయి.అయితే ఈమె ఇంత వరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు.మరి ఈమె కథల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది అని తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని తెలుస్తుంది.అయితే 2023 రాబోతున్న విషయం తెలిసిందే.
మరి కొత్త ఏడాదిలో ఈమె ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్ వస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ మృణాల్ తో ఒక సినిమా చేసేందుకు మంతనాలు జరుపు తున్నారని తెలుస్తుంది.
మరి హీరో ఎవరో కూడా తెలుస్తుంది.ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించ బోతున్నాడు అని ఇందులో ఈయనకు జోడీగా మృణాల్ ను సెలెక్ట్ చేసింది అని తెలుస్తుంది.

కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సినిమాను రేపు ప్రకటించే అవకాశం ఉంది అని టాక్.మరి ఈ సినిమాకు నూతన డైరెక్టర్ పరిచయం కానున్నారని తెలుస్తుంది.ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అందుకే నానికి జోడీగా మృణాల్ సరిపోతుందని భావించి ఈమెను ఎంపిక చేసారని కొత్త ఏడాది ఆరంభమే ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.ఈ సినిమా షూట్ ఎక్కువ లండన్ లోనే జరగనుందని మైత్రి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని మృణాల్ సైన్ చేయడమే మిగిలింది అని టాక్ వస్తుంది.
చూడాలి ఈ సినిమా రేపు అనౌన్స్ చేస్తారో లేదో.







