తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్న వివాదాలకు, గ్రూపు రాజకీయాలకు ఇక చెక్ పడినట్లే కనిపిస్తోంది.ఇటీవల నియమించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నియామకాల తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అసంతృప్తికి గురై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం హోటహోటిన ఏఐసిసి దూతగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది.
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించడంతో దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలు అందరితోనూ విడి విడిగా సమావేశాలు నిర్వహించారు.అసలు వివాదాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనే అంశాలపై కీలక నేతలు అందరితోనూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసంతృప్తికి గురైన నేతలంతా ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికంఠాకూర్ వ్యవహార శైలిపై దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదులు చేశారు.ఆయన ఏకపక్ష వైఖరి కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని , వెంటనే ఆయనను మార్చాలంటూ ప్రధానంగా డిమాండ్ వినిపించారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కంటే మాణికం ఠాకూర్ పైనే ఎక్కువగా సీనియర్ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో దిగ్విజయ్ కూడా ఈ వ్యవహారాలపై విచారణ నిర్వహించారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ ను తప్పిస్తే మొత్తం పరిస్థితి అదుపులోకి వస్తుందని, ప్రాథమికంగా ఆయన నిర్ధారించుకున్నట్లు సమాచారం .

ఇదే విషయమై హై కమాండ్ కు కూడా ఆయన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.అయితే తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి నీ చక్కదిద్దేందుకు ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావించినా, తెలంగాణలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్ట్యా ఆమెకు ఆ బాధ్యతలు ఇవ్వడం సరికాదని నిర్ణయానికి వచ్చారట.ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించే అవకాశం కనిపిస్తోంది.1986 నుంచి పార్టీలోనే ఉన్న సు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు .రాజస్థాన్ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రణదీప్ సర్జేవాలా ను ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.







