గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం.అల్లు రమలింగయ్య తనయుడు, అల్లు అరవింద్ తోబుట్టువు ట్రైన్ ప్రమాదం లో కానీ మూశాడు అనే విషయం.
అసలు విషయం ఏమిటి అంటే అల్లు రామలింగయ్య తనయుడితో పాటు ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడు కూడా అదే ప్రమాదం లో కానీ మూశాడు.ఆ హీరోయిన్ మరెవరో కాదు కవిత.
జగన్మోహిని సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగి వందల సినిమాల్లో నటించిన కవిత సైతం తన తమ్ముడిని కొలోయింది.ఎంతో బంగారం లాంటి భవిష్యత్ ఉంటుందని అనుకున్న సమయంలో తన తమ్ముడు కన్ను మూయడం అమే జీవితంలో తీరని లోటు అంటూ చెప్పారు కవిత.
అల్లు అరవింద్ తమ్ముడు మరియు కవిత తమ్ముడు ఇద్దరు క్లాస్ మెట్స్ అనే విషయం ఎవరికి పెద్దగా తెలియదు.ఇద్దరు కలిసి బాగా చక్కర్లు కొట్టేవారట.ఒక రోజు సరదాగా ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కడానికి వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లారట.అలా వెళ్ళిన సందర్భం లోనే ఆ స్నేహితులు ఇద్దరు కన్ను మూశారు.
అప్పట్లో ఎలక్ట్రిక్ ట్రైన్స్ పైన ఎవరికి పెద్దగా అవగాహన లేదు.అవి ఎక్కలో క్లియర్ గా తెలియకపోవడం తో ఇద్దరు ఒకేసారి ఆ ట్రైన్ క్రింద పడి మరణించారు.
ఈ సంఘటన తో అటు అల్లు వారి కుటుంబం తో పాటు ఇటు కవితం కుటుంబం కూడా షాక్ లోకి వెళ్ళిపోయారు.

చిన్న వయసులోనే ఇలా అర్ధాంతరంగా తిరిగి రాని లోకానికి వెళ్ళడం తో ఇండస్ట్రీ కూడా ఉలిక్కి పడింది.ఇక నటి కవిత ఈ సంఘటన తర్వాత ఏడాది పాటు కోలుకోలేక పోయింది.తమ్ముడిని తలచుకుంటూ తన గదికి మాత్రమే పరిమితం అయ్యింది.
కూతురిని మామూలు మనిషిని చేసుకోవడం కోసం కవిత తల్లి చాలా ప్రయత్నించింది.మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళడం తో పాటు పిచ్చి పిచ్చి గా ప్రవర్తించే వారట.
కానీ కొన్నాళ్ళకు కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు.అలా తన తమ్ముడి మరణం జీవితంలో పెద్ద లోటు అంటూ కవిత తెలిపారు.







