సండ్ర వెనుక ఉన్నది ఎవరు? తుమ్మలని పొమ్మనలేక పొగ పెడుతున్నారా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కాయి.ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలంతా, ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో వ్యక్తులుగా మారిపోతున్నారు.

 Sandra Venkata Veerayya Thummala Nageswara Rao Issue In Brs Party Details, Tumma-TeluguStop.com

ఏదో ఒక అంశంతో వారు హైలెట్ అవుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తర్వాత ఈ రకమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో టిడిపిలో కీలకంగా పనిచేసి,ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న కొంతమంది కీలక నేతల వ్యవహారం చర్చినియాంశంగా మారింది.అందులో ప్రధానంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

చాలాకాలంగా తుమ్మల నాగేశ్వరావు బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉంటున్నారు, రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు సరైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వలేదని,మంత్రి పదవి వస్తుందనుకున్నా, కేసీఆర్ పట్టించుకోకపోవడంపై తుమ్మల అసంతృప్తితోనే ఉంటున్నారు.ఈ క్రమంలో తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న క్రమంలో తుమ్మల చూపు టిడిపి పై పడిందనే ప్రచారం ఊపందుకున్న సమయంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య సంచలన విమర్శలు చేశారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా వీరయ్య విమర్శలు చేశారు.

Telugu Nageswarao, Sandra Veerayya, Sattupally Mla, Telangana, Telanganadesam, T

తనపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముసుగు తీసి రాజకీయాలు చేయాలని వీరయ్య వార్నింగ్ ఇచ్చారు.తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టిడిపిలో ఉన్నప్పుడు ఒకలా, బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మరోరకంగా ఇబ్బంది పెడుతున్నారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.తాను ఎక్కడా అహంభావంతో పనిచేయలేదని, కొంతమంది తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఉద్దేశించి వీరయ్య విమర్శలు చేశారు.

అయితే వీరయ్య ఎక్కడా తుమ్మల పేరు ప్రస్తావించకపోయినా, ఆయన తుమ్మలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గానే అందరికీ అర్థమవుతుంది.

Telugu Nageswarao, Sandra Veerayya, Sattupally Mla, Telangana, Telanganadesam, T

అయితే పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరావు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో సత్తుపల్లిలో ఉన్న సండ్రకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వీరయ్య కు నాగేశ్వరావు కు మధ్య ఉన్న విభేదాలకు కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.ఇక చాలాకాలంగా తుమ్మల విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది.

ఆయన టిడిపిలోకి వెళ్తారని ప్రచారం కూడా ఈ మధ్యకాలంలో ఊపందుకోవడంతో.వీరయ్య ద్వారా తుమ్మలకు చెక్ పెట్టేందుకు ఆయనపై విమర్శలు చేయిస్తూ,, పొమ్మను లేక పొగ పెడుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube