గత కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై హడావుడి నడుస్తోంది.కచ్చితంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని, అందుకే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను జనాల్లోకి పంపుతున్నారనే అభిప్రాయాలు వైసిపి నాయకుల్లోనే ఉన్నాయి.
అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదిని కలిసేందుకు జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లారు.ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశంపై ప్రధానితో జగన్ చర్చించారని దీనికి ఆయన సైతం అంగీకారం తెలిపినట్లుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి.
గత ఏడాదిగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా, వైసిపి శ్రేణులంతా జనాల్లో ఉండే విధంగా జగన్ అనేక కార్యక్రమాలను రూపొందించారు.
ఇప్పుడు ఢిల్లీ టూర్ తో అవన్నీ ముందస్తు ఎన్నికల కోసమే అన్న అభిప్రాయాలు అందరిలోనూ కలుగుతున్నాయి.జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోది తో పాటు , కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు.
ప్రస్తుతం జగన్ ఏపీకి వచ్చేసారు.జగన్ ఢిల్లీ టూర్ లో ఉండగానే ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వైసిపి శ్రేణులకు అందాయి.అలాగే ఇంటిలిజెన్స్ అధికారులకు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ముందస్తు ఎన్నికల విషయంలో ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి.
నాయకులు సిద్ధంగా ఉన్నారా లేదా అని విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాల్సిందిగా నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మేరకు నిఘా వర్గాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా మొదలైందట.ఇవన్నీ ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే అనేది అర్థమవుతుంది.ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు అనేకసార్లు ముందస్తు ఎన్నికల అంశంపై స్పందించారు.
కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని, దీనిపై కచ్చితమైన సమాచారం ఉందంటూ అనేక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.దీనికి తగ్గట్లు గానే చంద్రబాబు అనేక కార్యక్రమాలతో నిత్యం జనాల్లో ఉంటున్నారు.
లోకేష్ ఇప్పటికే యువ గళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారాహి వాహనం ద్వారా ఏపీ అంతటా బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు.







