ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో చాలామంది విద్యార్థులు అమెరికా తర్వాత ఎక్కువగా వెళ్లి చదువుకోవాలి అనుకునేది యూకే లోనే.ఎందుకంటే బ్రిటన్ లో నాణ్యమైన విద్యను అందించే ప్రపంచ స్థాయి ప్రమాణాల యూనివర్సిటీలు ఉండడంతో పాటు విద్యార్థి అనుకూల విధానాలు కూడా అందుకు ముఖ్య కారణం అని చాలామంది ప్రపంచ మేధావులు చెబుతూ ఉంటారు.
తాజాగా విదేశీ విద్యార్థులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల ఇతర విదేశీ విద్యార్థులతో పాటు భారతీయ విద్యార్థులు ప్రధానంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటి నుంచి విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేయడానికి ముందే ఉద్యోగం చేయడానికి వీలుగా వర్క్ వీసా కు మారే అవకాశం ఉంటుంది.

కానీ పాత పద్ధతి ప్రకారం డిగ్రీ పూర్తయి సర్టిఫికెట్ పొందిన తర్వాత కానీ వర్క్ వీసా కు మారడానికి వీలు లేకుండా ఉండేది.ఇకపై ఈ నిబంధనను మార్చి డిగ్రీ పూర్తి చేయడానికి ముందే విదేశీ విద్యార్థులు వర్క్ వీసా కు మారడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు.ఈ నిర్ణయం బ్రిటన్ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇటు విదేశీ విద్యార్థులకు, అటు బ్రిటన్ ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని వీసా ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంజనా వేస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రధాన అడ్డంకిగా భావించే ఈ నిబంధనలను తొలగించడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు uk లలో యూనివర్సిటీలో చేరే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న నిపుణులైన ఉద్యోగుల కొరత కూడా తీరుతుందని చెబుతున్నారు.కరోనా తర్వాత బ్రిటన్ నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది.
అవసరమైన ఇతర నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు డిగ్రీ పూర్తి కాకుండానే వర్క్ వీసా కు అనుమతించడం వల్ల ఉద్యోగుల కొరతకు సంబంధించిన సమస్య కూడా తీరే అవకాశం ఉంది.వారు డిగ్రీ పూర్తయిన తర్వాత వారి దేశాలకు వెళ్ళిపోకుండా ఇక్కడే దేశ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని అమెరికా మేధావులు భావిస్తున్నారు.







