రామ్ చరణ్ #RC15 మరియు మెగా వారసుడు వచ్చేది ఓకే నెలలో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో భారీ సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న ఆ సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

 Ram Charan Next Movie Release And Upasana Delivery Same Month-TeluguStop.com

కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా ను సంక్రాంతి భరి నుండి తొలగించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మే నెలలో రామ్ చరణ్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా రామ్ చరణ్ స్థాయిని మరో సారి పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టడం ఖాయం అంటూ మెగా అభిమానులు ధీమా తో ఉన్నారు.

ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉపాసన డెలివరీ అయ్యేది కూడా అదే నెలలో అంటూ తెలుస్తుంది.శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా విడుదలకు వారం పది రోజులు అటు ఇటు గానే మెగా వారసుడు ల్యాండ్ అవ్వబోతున్నాడట.ఉపాసన మెగా వారసుడికి జన్మనిచ్చేది అదే నెల లో అంటూ సమాచారం అందుతుంది.

అదే కనుక నిజం అయితే వచ్చే ఏడాది మే నెల ఖచ్చితం గా మెగా ఫాన్స్ కి జీవితంలో గుర్తుండి పోయే నెల అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఉపాసన తల్లి కాబోతుందనే విషయం అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇప్పుడు మే నెలలో ఆమె బిడ్డ కు జన్మను ఇవ్వబోతుందనే విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అదే నెల లో చరణ్ శంకర్ కాంబో సినిమా విడుదలబోతుందని తెలిసి ఢబుల్‌ ధమాకా అన్నట్లుగా సంతోషం గా మెగా ఫాన్స్ డాన్స్‌ లు చేస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube