సాధారణంగా కొందరి అండర్ ఆర్మ్స్ చాలా డార్క్ గా ఉంటాయి.డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, చెమట, అన్ వాంటెడ్ హెయిర్ ను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్ గా మారుతుంటాయి.
ఇలాంటి వారు స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ లో ఏర్పడిన నలుపును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క దెబ్బతో అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బార్లీ గింజలు, రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకుని మెత్తని పొడి లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న బార్లీ గసగసాల పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.
చివరగా సరిపడా రోజు వాటర్ ను వేసి అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం నిమ్మ చెక్కతో స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

కనీసం ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకోవాలి.అనంతరం ఏదైనా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క దెబ్బతో నలుపు పోతుంది.
అండర్ ఆర్మ్స్ తెల్లగా మరియు మృదువుగా మారతాయి.డార్క్ అండర్ ఆర్మ్స్ తో సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.







